NTV Telugu Site icon

అధికారుల సమన్వయ లోపం .. రాయలచెరువు గ్రామాలకు శాపం

ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు.

నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు. ఇదే ఇప్పుడు వారి పాలిటశాపంలా మారిందంటున్నారు ముంపు గ్రామస్థులు. నిన్న మంత్రులు పర్యటన సమయంలోను తూములు మూసివేత అంశానే ప్రధానంగా ప్రస్తావించారు ముంపు గ్రామస్థులు. 2 వేల ఎకరాలలో వున్న చెరువుని 45 ఎకరాలకు కుదించేలా ఆక్రమణలకు గురైందంటూ వాపోతున్నారు దిగువ గ్రామస్థులు. ముఖ్యమంత్రి వద్దకు సమస్యని తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని గ్రామస్థులకు హామీఇచ్చారు ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి.

ప్రస్తుతం చెరువుకు లీకేజీగా వస్తూన్నది ఉట నీరుగా భావిస్తున్నారు అధికారులు. 500 సంవత్సరాల క్రితమే రాయల వారు చెరువుకట్టను రాళ్ల మధ్య సీసంతో నిర్మించారంటున్నారు గ్రామస్థులు. పటిష్టంగా వున్న చెరువు కట్ట తెగే అవకాశం లేదంటున్నారు దిగువ గ్రామస్థులు. ఒకవేళ చెరువుకట్ట తెగితే శ్రీకాళహస్తి వరకు నీటి ప్రవాహం వుంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.