NTV Telugu Site icon

బాలకృష్ణ సినిమా కోసం లైబ్రెరీల బాట పట్టిన గోపీచంద్

‘క్రాక్’ సినిమాతో అటు రవితేజకు ఇటు చిత్ర పరిశ్రమకు ఊపు తెచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్. కరోనా తర్వాత నిస్సత్తువగా సాగుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘క్రాక్’ గొప్ప ఊపిరి పోసింది. ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులను 50 శాతం ఆక్యుపెన్సీతో ఫుల్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో తెలుగు చిత్రపరిశ్రమదే ముందడుగు. ఈ రోజున 80 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే వాటికి ‘క్రాక్’ ఇచ్చిన భరోసానే కారణం. ఇక విషయానికి వస్తే ఆ సినిమా తర్వాత గోపీచంద్ బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత చేయబోయే సినిమా గోపీచంద్ దర్శకత్వంలోనే. ఈ సినిమా స్ర్కిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు గోపీచంద్. దాని కోసం లైబ్రెరీల వెంట తిరుగుతూ రీచర్చ్ పనిలో పడ్డాడు. ఇదే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు గోపీచంద్. వేటపాలెంలోని సరస్వత నికేతన్ లైబ్రెరీలో తనకు కావలసి క్లిప్పింగ్స్ వెతుక్కుంటూ ఉన్న ఇమేజ్ లు పోస్ట్ చేసి నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటూ వందేళ్ల క్రితం లైబ్రెరీ అని దేవాలయసందర్శన ఫీలింగ్ కలిగిందన్నాడు. మైత్రీమూవీస్ బాలకృష్ణ, గోపీచంద్ మూవీని నిర్మించనుంది.