Site icon NTV Telugu

నామినేషన్ల ఉపసంహరణపై మండిపడ్డ గోనె

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగినా, ఒకటి రెండుచోట్ల రచ్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోనే ప్రకాశ్ రావు మీడియా సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ లో నామినేషన్ల ఉపసంహరణ పై హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదుచేస్తానన్నారు గోనె.

నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సీసీ పుటేజీ ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ని కోరారు. సమాచార హక్కు చట్టం క్రింద నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అక్రమాలు జరిగాయి. మంత్రి హరీష్ రావు పాపం పండిందని, ఆయనకు త్వరలో తగిన బుద్ది చెబుతామన్నారు గోనె ప్రకాష్ రావు. అభ్యర్థి లేకుండా సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు ఉపసంహరించారని ఆయన ఆరోపించారు. అవసరమైతే సుప్రీంకోర్టులో ‌న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు.

Exit mobile version