Site icon NTV Telugu

మ‌హారాష్ట్ర‌లో భూమిని ఢీకొట్టిన శిల‌… ప‌రిశీలించ‌గా…

మ‌హారాష్ట్ర‌లో గ‌త కొన్ని రోజులుగా ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి.  వ‌ర్షాలు, ఈదురు గాలుల స‌మ‌యంలో అప్పుడ‌ప్పుడు ఆకాశంలోనుంచి వ‌డ‌గ‌ళ్లు, చేప‌లు వంటివి కురుస్తుంటాయి.  అయితే, ఉస్మానాబాద్ జిల్లాలోని వ‌శి తాలూకాలో ఓ రైతు పొలంలో పనిచేసుకుంటుండ‌గా, ఒక్క‌సారిగి ఈదురు గాలులతో కూడిన వ‌ర్షం కురిసింది.  ఆ స‌మ‌యంలో ఆకాశంలోనుంచి ఓ రాయి హ‌టాత్తుగా ఈ రైతు పొలంలో ప‌డింది.  రైతుకు 8 అడుగుల దూరంలో ప‌డిన ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు.  వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చాడు.  రైతులు ఆ రాయిని ప‌రిశీలించారు.  ఆకాశం నుంచి రాలిప‌డిన శిల‌గా దానిని గుర్తించారు.  అయితే, రంగు బంగారు వ‌ర్ణంలో ఉండ‌టంతో స్వ‌ర్ణ‌శిల‌గా పేర్కొన్నారు.  జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియాకు ఆ శిల‌ను అప్ప‌గిస్తున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  

Read: ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన భారత్‌ !

Exit mobile version