NTV Telugu Site icon

Gold prices: గోల్డెన్ ఛాన్స్ .. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

Gold

Gold

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ దిగి వస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. ఇవాళ గోల్డ్ రేటు రూ.210 మేర తగ్గింది. అయితే, వెండి ధర కూడా రూ.300 తగ్గింది.
Also Read: Global Icon: అల్లు అర్జున్ ని గ్లోబల్ ఐకాన్ చేశారు… చరణ్ కి పోటీగానేనా?

దేశంలో బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజు తగ్గాయి. సోమవారం (మార్చి 27)న రూ. 54,710గా ఉన్న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.54,500గా ఉంది. రూ.59,690గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.59,450గా ఉంది.హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గి రూ.59,690 నుంచి రూ.59,450కు చేరింది. కిలో వెండిపై రూ.300 తగ్గి రూ.76,000 నుంచి రూ.75,700 ధరకు చేరుకుంది
Also Read: Dasara: లాస్ట్ పాట… లాస్ట్ ప్రమోషనల్ కంటెంట్… రిజల్ట్ ఏంటో?

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,600గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450గా నమోదైంది. బెంగళూరు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,500గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 55,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110కి చేరింది.