NTV Telugu Site icon

మ‌గువ‌ల‌కు షాకిచ్చిన పుత్త‌డి… భారీగా పెరిగిన ధ‌ర‌లు…

గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న పుత్త‌డి ధ‌ర‌లు ఈరోజు భారీగా పెరిగాయి.  10 గ్రాముల బంగారం ధ‌ర రూ.330 పెరిగింది.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం వివిధ న‌గ‌రాల్లో పెత్త‌డి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,330గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.44,300గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,300గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 44,300గా ఉన్న‌ది.  అటు విజ‌య‌వాడ‌లోనూ ఇవే ధ‌ర‌లు ఉన్నాయి.  ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,670గా ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.46,450గా ఉన్న‌ది. బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి.  హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ.67,700కి చేరింది.

Read: మ‌ళ్లీ అల్‌ఖైదా పుంజుకుంటుందా? ఆ అధికారులు ఏమంటున్నారు?