NTV Telugu Site icon

జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 ప్రయోగం విఫలం.

GSLV F10

GSLV F10

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నింగికెగిసిన జీఎస్‌ఎల్బీ-ఎఫ్‌ 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. రెండో దశ తర్వాత రాకెట్‌లో సమస్య తలెత్తింది. రెండు స్టేజ్‌ల వరకు విజయవంతంగా నింగిలోకి వెళ్లిన రాకెట్… మూడో దశలో గతి తప్పింది. ఎఫ్‌ 10 రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్ – 1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే క్రమంలో.. మూడో దశలో సమస్య తలెత్తినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఏడాది ఇస్రో చేసిన రెండో ప్రయోగం ఇది. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణ కోసం ఈ శాటిలైట్ పని చేయాల్సింది.

క్రయోజనిక్‌ దశలో రాకెట్‌లో సమస్య ఎదురైంది.. జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ విఫలమైందని వెల్లడించారు ఇస్రో చైర్మన్‌ శివన్‌.. రాకెట్‌ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు… బుధవారం ఉదయం 3.43 గంటల నుంచే రాకెట్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యింది.. కానీ, ఇవాళ ఉదయం జరిగిన ప్రయోగం మాత్రం విఫలం అయ్యింది.. వాస్తవానికి ఈ రాకెట్‌ ప్రయోగం గతేడాదిలోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.