అనగనగా అదోక గ్రామం. ఆ గ్రామం చుట్టు పెద్దపెద్ద కొండలు.. దీంతో ఆ గ్రామంలోకి మూడు నెలలపాటు ఎంట కనిపించదు. సంవత్సరంలో మూడు నెలల పాటు ఆ గ్రామం ఎండపొడ లేకుండా చీకట్లో మగ్గుతుంది. దీంతో గ్రామంలోని ప్రజలు వినూత్నంగా ఆలోచించి సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం పలుచని స్టీల్ అద్దాలను వినియోగించారు. వాటిని కొండల పైభాగంలో ఏర్పాటు చేసి, సూర్యుడి కాంతికి అనుగుణంగా అవి తిరిగేలా రూపొందించారు. ఆయా అద్దాలపై పడిన సూర్యుని కాంతి నేరుగా ఆ గ్రామం మధ్యలో పడేలా చూశారు. ఎన్నో ఏళ్లుగా మూడు నెలల పాటు అంధకారంలో మగ్గిన ప్రజలు ఇలా సొంతంగా సూర్యకిరణాలు గ్రామంలో పడేలా ఏర్పాటు చేసుకోవడంతో గ్రామంలోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందో చెప్పలేదు కదా… ఇటలీలోని ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో వెనెగెల్లా అలే గ్రామం ఉంది. 1300 శతాబ్ధం నుంచి అంటే దాదాపు 800 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో చలికాలంలోని మూడు నెలలు ఎండపొడకు దూరంగా ఉన్నారు.
Read: నాసా వ్యూహం: 2024లో చంద్రుని మీద… 2030 వరకు మార్స్‌లో…
