అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఇలానే, కర్ణాటకలోని ఉడిపిలో మత్స్యకారుని వలకు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది. ఈ రకమైన చేపలకు బహిరంగ మార్కెట్‌లో భారీ ధర ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరకమైన చేపల్లో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. మెడిసన్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు.
Read: జరభద్రం: ఆ వైరస్ గాలిలో మూడు మీటర్లకు మించి ప్రయాణం చేయగలదు…
ఉడిపిలో మత్స్యకారునికి 18 కిలోల బరువైన ఘోల్ ఫిష్ దొరికింది. వలకు చిక్కిన ఈ చేపను మాల్పే ఓడరేవుకు తీసుకొచ్చి వేలం వేశారు. అరుదైన చేప కావడంతో కిలోకి 10 వేల చొప్పున 18 కిలోల చేపను రూ.1.80 లక్షలకు అమ్మారు. సాధారణంగా ఘోల్ చేపల మాంసం చాలా బలమైన ఆహారం అని, ఈ రకమైన చేపలు కిలో 9 నుంచి 10 వేల వరకు పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. చాలా కాలంగా తాను సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నానని, కానీ, ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడం ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు చెప్పుకొచ్చాడు.