NTV Telugu Site icon

హైద‌రాబాద్‌లో గ‌ణ‌ప‌తి ల‌డ్డూల వేలంపాట‌లు… ఎక్క‌డ ఎంత అంటే…

హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది.  నిన్న మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల స‌మ‌యంలో ఖైరతాబాద్ గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం త‌రువాత వివిధ ప్రాంతాల నుంచి వ‌స్తున్న గ‌ణ‌ప‌తుల విగ్రహాల‌ను హుస్సేన్ సాగర్‌లో నిమ‌జ్జ‌నం చేస్తున్నారు.  పెద్ద ఎత్తున నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది.  ఇక నిన్న‌టి రోజున బాలాపూర్ ల‌డ్డూ వేలం రికార్డుస్థాయిలో రూ.18.90 లక్ష‌లకు అమ్ముడు పోయింది.  అయిదే, బాలాపూర్‌తో పాటుగా న‌గ‌రంలో అనేక మండ‌పాల్లో వినాకుల ల‌డ్డూల‌ను వేలం వేశారు.  ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌కు వేలం జ‌రిగిందో ఇప్పుడు చూద్దాం.  

చేవెళ్ల ర‌చ్చ‌బండ‌- రూ.14.01 లక్ష‌లు
ఉప్ప‌ర‌ప‌ల్లి, రాజేంద్రన‌గ‌ర్ – 11.11 ల‌క్ష‌లు
వీరాంజ‌నేయ భ‌క్తి స‌మాజం, బ‌డంగ్ పేట – 10.50 ల‌క్ష‌లు
వీర‌భ‌ద్ర‌స‌మాజం, మంచిరేవుల -8.10 ల‌క్ష‌లు
బౌరంపేట – 7.20 ల‌క్ష‌లు
స‌ర్ధార్ ప‌టేల్ న‌గ‌ర్ – 6.51
అత్తాపూర్ – 6.50
న‌వ‌జ్యోతి యువ‌జ‌న సంఘం, మ‌ణికొండ – 6.50 ల‌క్ష‌లు
తుక్కుగూడ బొడ్రాయి – 6.01 ల‌క్ష‌లు
బాచుప‌ల్లి – 5.01 ల‌క్ష‌లు

Read: సెప్టెంబర్ 20, సోమవారం దిన ఫలాలు