NTV Telugu Site icon

భారీ ఎపిసోడ్‌ను రద్దు చేసిన హెచ్‌బీవో

హాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకే ఆ సినిమాల్లో వాడే గ్రాఫిక్స్‌ అంతా న్యాచురల్‌గా కనిపిస్తుంటాయి కూడా. అయితే తాజాగా హెచ్‌బీవో ఒరిజినల్స్‌ కోసం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌- స్పిన్‌ఆఫ్‌’ పైలట్‌ ఎపిసోడ్‌ను రద్దు చేసింది. టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ బాహుబలి ది బిగినింగ్‌ సినిమా కంటే ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణకు హెచ్‌బీవో ఎక్కువ ఖర్చుచేసింది.

బాహుబలి మొదటి పార్ట్‌కు 28 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగా, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్పిన్‌ఆఫ్‌’ పైలట్‌ ఎపిసోడ్‌కు 30 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చచేయడం విశేషం. అయితే ఇంత భారీ బడ్టెట్‌తో నిర్మిస్తోన్న ఈ పైలట్‌ ఎపిసోడ్‌ను రద్దు చేస్తున్నట్లు హెచ్‌బీవో ప్రకటించింది.