దారుణం.. నలుగురిని బలితీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ గేమ్స్ ఓ కుటుంబాన్ని బలితీసుకుంది.. మొబైల్ గేమ్‌లలో పిల్లలే కాదు.. పెద్దలు కూడా మునిగిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. కొందరు ప్రాణాలే తీసుకున్న ఘటనలు ఉన్నాయి.. తాజాగా, ఓ కుటుంబాన్ని మొత్తం బలితీసుకున్నాయి ఆన్‌లైన్ గేమ్స్.. చెన్నైలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు..!
Also Read
ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై, పనికి కూడా వెళ్లకుండా, అప్పుల పాలయ్యాడో వ్యక్తి.. పెరుంగుడి పెరియార్‌లోని ఓ అపార్టుమెంట్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు మణికంఠన్ అనే వ్యక్తి.. కోయంబత్తూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.. అయితే, రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.. ఆన్‌లైన్‌లో నగదు పెట్టి గేమ్‌లు ఆడుతూ అప్పులపాలయ్యాడని పోలీసులు చెబుతున్నారు.. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు కూడా జరిగేవి.. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన మణికంఠన్.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తంగా.. ఆన్‌లైన్ గేమ్స్ అప్పులపాలుచేసి.. మణికంఠన్ (36), తార (35), ధరణ్ (10), దహాన్ (1) ప్రాణాలు తీశాయి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
- Tags
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!