ఈ విశ్వంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? దీనిపై గత కొన్ని శతాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఆధారాలు ఏవీ లభించలేదు. మనమందరం గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక కథనాలను వింటునే ఉన్నాం. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ వార్తలపై చాలా ప్రశ్నలను కూడా సంధిస్తుంటారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన గ్రహాంతరవాసులకు చెందిన కథనాల్లో ఏ ఒక్కదానిలో కూడా నిజం రుజువు కాలేదని సమాచారం.
READ MORE: Most sixes in T20: టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడు.. స్కై, బట్లర్ను వెనక్కి నెట్టి
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఈ నేపథ్యంలో పెంటగాన్ మాజీ గూఢచారి లూయిస్ ఎలిజోండో ఏలియన్స్ గురించి చేసిన వాదన సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఎలిజోండో జర్నలిస్టులతో మాట్లాడుతూ.. గ్రహాంతరవాసులు భూమిపైకి దిగినట్లు ఆయన వీడియోలో చెప్పారు. “అమెరికా ప్రభుత్వానికి ఏలియన్స్ ఉనికి గురించి తెలుసు. కానీ అమెరికా ప్రస్తుతం ఈ సమాచారాన్ని దాస్తోంది. అధికారుల వద్ద గ్రహాంతర వాసులకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. అంటే అమెరికా ఆధీనంలో యూఎఫ్‌ఓలు ఉన్నాయి. 1947 నాటి రోస్‌వెల్ విపత్తులో గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చినప్పుడు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆ వాహనాన్ని భద్రపరిచింది.” అని పేర్కొన్నారు. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించిన వెంటనే గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆసక్తి మళ్లీ మొదలైంది. ఈ పోస్ట్‌పై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ మాజీ గూఢచారి మాటలపై విశ్వాసం వ్యక్తం చేయగా, మరికొందరు ఇది కేవలం కథగా భావించారు.
READ MORE: Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు
లూయిస్ ఎలిజోండో ఎవరు?
లూయిస్ ఎలిజోండో విదేశీయులకు సంబంధించిన క్లెయిమ్‌ల కోసం తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా పనిచేశారు. 2017 లో న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అందులో కూడా ఆయన గ్రహాంతరవాసుల గురించి మాట్లాడారుఉ. ఈ అంశాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అమెరికా ప్రభుత్వం కోరుకోవడం లేదని లూయిస్ పేర్కొన్నారు.
