NTV Telugu Site icon

హీరోయిన్ తో సహజీవనం, మోసం… మంత్రి అరెస్ట్

Former AIADMK Minister Manikandan arrested for raping actress

హీరోయిన్ తో సహజీవనం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసిన ఎఐఎడిఎంకె మంత్రి ఎం మణికందన్‌ను చెన్నై నగర పోలీసులు బెంగళూరులో ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… రెండు వారాల క్రితం మంత్రి ఎం మణికందన్‌ పై అడయార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కోలీవుడ్ హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె మణికందన్ తనను ప్రేమ పేరుతో వాడుకున్నాడని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, తాను గర్భవతి కావడంతో అబార్షన్ చేయించారని చెప్పుకొచ్చింది.

Also Read : టాలీవుడ్ సెలెబ్రిటీస్ ‘ఫాదర్స్ డే’ విషెస్

అంతేకాకుండా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఇప్పుడు పెళ్ళి గురించి అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని, పైగా తనను చంపడానికి మనుషులను సైతం ఏర్పాటు చేశాడని తెలిపి సంచలనం సృష్టించింది. దీంతో అత్యాచారం, గర్భస్రావం, మోసం వంటి ఆరోపణలతో వివిధ ఐపిసి సెక్షన్ల కింద మణికందన్‌పై కేసు నమోదైంది. ఈ కేసు కోర్టు వరకు వెళ్లడంతో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అతనికి బెయిల్ ను నిరాకరించింది కోర్టు. దీని తరువాత మణికందన్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి చెన్నై సిటీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 44 ఏళ్ల ఈ రాజకీయ నాయకుడిని పోలీసుల ప్రత్యేక బృందం ఈరోజు బెంగళూరులో పట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.