Site icon NTV Telugu

కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్‌ పైప్‌లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు తెలియజేశారు. అయితే, ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వరంగానికే ఉంటాయని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్‌.

Exit mobile version