NTV Telugu Site icon

ఆ మత్స్యకారుడి పంట పండింది.. వలలో ఏం పడ్డాయంటే?

అదృష్టం కలిసి వస్తే బికారి కూడా బిలియనీర్ అవుతాడని మరోసారి నిరూపణ అయింది. నిత్యం సముద్రంలో తిరిగే మత్స్యకారులకు అప్పుడప్పుడు లక్షల విలువచేసే చేపలు పడుతుంటాయి. కానీ ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో చేపలు కాదు బరువైన వస్తువులు పడ్డాయి. వాటిని తెరిచి చూస్తే అంతే.. కళ్ళు చెదిరిపోయాయి. రాత్రిక రాత్రి ఆ మత్స్యకారుడు లక్షలు సంపాదించాడు.

ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎంత కష్టపడ్డా అతని కుటుంబం పేదరికంలోనే వుండిపోయింది. ఒక రోజు అతనికి అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అత‌నికి విసిరిన‌ వలలో బరువైనవి దొరికాయి. ఏంటో అని ఆ వలను జాగ్రత్తగా వల పైకి లాగాడు.

వలలోంచి బరువైనవి బయటపడ్డాయి. అవి బాక్సుల్లా కనిపించేసరికి వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వలలో చేపలకు బదులుగా దొరికిన పెట్టెల్లా ఖరీదైన యాపిల్ యాపిల్ ఐఫోన్లు, మ్యాక్ బుక్ లాప్‌టాప్‌లు వున్నాయి. వాటి ఖరీదు లక్షల్లో వుంటుందని తెలియడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆబాక్స్ లు వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్యాకింగ్ బాగుండడం వల్ల ల్యాప్ టాప్, ఫోన్లు పాడవలేదంటున్నాడు మత్స్యకారుడు.