చిన్న చిన్న చేపలను పాములు తినేస్తుంటాయి. అయితే, పాములను చేపలు తినడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. ఓ చేప నీటి కొలను ఒడ్డున ఉన్న ఓ బొరియవైపు ఒపికగా చూస్తూ ఉన్నది. అంతలో ఆ బొరియ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అలా వచ్చిన ఓ పామును నీటిలో ఉన్న ఆ చేప మెల్లిగా మింగడం మొదలు పెట్టింది. అది చిన్న చేప అనుకుంటే పొరపాటే. దాదాపు మూడున్నర అడుగుల పాము. ఆ పామును మెల్లిగా మింగేసింది. తాపీగా మింగేసి, తనకేమి తెలియదన్నట్టుగా తాపీగా నీటిలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కాగా, ప్రస్తుతం వైరల్ అవుతున్నది. మూడున్నర అడుగుల పామును చేప ఎలా మింగిందో అర్థం కాలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read: వైరల్: బ్లాక్ కోబ్రా నీళ్లు తాగడం ఎప్పడైనా చూశారా… ఆ వ్యక్తి సాహసానికి ఫిదా…
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి