కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్‌లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్‌ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి.
Read: డెంగీతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే కన్నుమూత
ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. కేరళలో ఈరోజు తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి ఈనెల 6 వ తేదీన కోచికి వచ్చిన ప్రయాణికుడికి ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడా పాజిటివ్ గా వచ్చింది. శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 37 కి చేరింది. కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.
