దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 66 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా.. ఎవరూ మరణించలేదని.. సంబరపడుతున్న జనాలకు ఊహించని షాక్ తగిలింది.
తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇవాళ ఉదయమే ఒమిక్రాన్ సోకిన రోగి.. మరణించినట్లు ప్రకటించింది బోరిస్ సర్కార్. ఇక యూకే నిన్న ఒక్క రోజే 600 లకు పైగా… ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
