Site icon NTV Telugu

బ్రేకింగ్‌ : గోషామహల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ గోషామహల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోషామహల్ లోని జింగుర్ బస్తీలో ఒక సెంట్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, సహాయక చర్యలు చేపట్టారు మాజీ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ ముకేష్ సింగ్.

సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version