NTV Telugu Site icon

Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి

Finland

Finland

రష్యా నుండి ఎదురయ్యే బెదిరింపులను పట్టించుకోకుండా ఫిన్లాండ్ అధికారికంగా NATO సైనిక కూటమిలో చేరింది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్ర అనంతరం తాజా చర్య రష్యాకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ చేరిక చారిత్రాత్మకం. ఫిన్లాండ్ ప్రధాని సౌలి నీనిస్టో మాట్లాడుతూ దేశ చరిత్రలో సైనిక నాన్‌లైన్‌మెంట్ శకం ముగిసిందని, కొత్త శకం ప్రారంభమైందని అన్నారు.

”ఫిన్లాండ్ నేడు రక్షణ కూటమి NATOలో సభ్యదేశంగా మారింది. మన చరిత్రలో మిలిటరీ నాన్‌లైన్‌మెంట్ శకం ముగిసింది. కొత్త శకం ప్రారంభమవుతుంది’’ అని ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి దేశం దాని స్వంత భద్రతను పెంచుకుంటుంది. అలాగే ఫిన్లాండ్ కూడా చేస్తుంది. అదే సమయంలో, NATO సభ్యత్వం మన అంతర్జాతీయ స్థానాన్ని బలపరుస్తుంది. భాగస్వామిగా, మేము చాలా కాలంగా NATO కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాము. భవిష్యత్తులో, NATO యొక్క సామూహిక నిరోధం, రక్షణకు ఫిన్లాండ్ సహకారం అందిస్తుంది అని ప్రకటించారు.

అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. తాజాగా ఫిన్లాండ్ చేరికతో నాటో ఆధిపత్యం రష్యాకు మరింత సమీపంలోకి వచ్చినట్లు అయింది. నాటోలో ఫిన్లాండ్ చేయడం వల్ల ఈ దేశంపై దాడి జరిగితే సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తుంది.రష్యాతో ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.

Show comments