Site icon NTV Telugu

కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి

సిద్దిపేట జిల్లా తొగుటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిని క‌రెంట్ షాక్ ఇచ్చి చంపాడు ఓ క‌ర్క‌శ తండ్రి. ఈ దారుణ సంఘ‌ట‌న‌.. శుక్ర‌వారం… తొగుటలోని వెంక‌ట్రావ్‌పే ట‌లో జ‌రిగింది. స్థానికులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం.. వెంక‌ట్రావ్‌పేట కు చెందిన మిరుదొడ్డి సునీత, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు కూతురు ప్రిన్సీ ఉంది. చిన్నారిని.. ఆడించ‌డానికి రాజ‌శేఖ‌ర్ మ‌ధ్యాహ్నం వ్య‌వ‌సాయ బావి వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు.

ఈ నేప‌థ్యంలోనే… షాటర్ వైర్ తో త‌న కూత‌రు కాళ్ల‌కు షాక్ ఇవ్వ‌డంతో చిన్నారి అక్క‌డిక్క‌డే మృతి చెందింది. ఈ విష‌యం తెలుసుకున్న.. ఆ గ్రామ‌స్తులు.. రాజ‌శేఖ‌ర్‌ను మంద‌లించారు. దీంతో పురుగుల మందు తాగి రాజ‌శేఖ‌ర్ ఆత్మ‌హత్యాయత్నం చేశాడు. ఇక, వెంట‌నే రాజ‌శేఖ‌ర్ ను గ‌జ్వేల్ స‌మీపంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే క‌న్న పేగుపై క‌ర్క‌శ‌త్వంగా వ్య‌వ‌హరించిన‌ట్లు తెలుస్తుంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version