NTV Telugu Site icon

ఫేస్‌బుక్ నుంచి సరికొత్త అప్‌డేట్

ఫేస్‌బుక్‌ మరో సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాలను యాక్సెస్‌ చేయలేని వారు, బ్లాక్‌ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు.. లైవ్‌ చాట్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ యాడ్‌ చేసింది. ఈ ఫీచర్.. యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందేందుకు తోడ్పడనుంది. అయితే, లైవ్‌ చాట్‌ సపోర్ట్‌ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్‌ చేసే అవకాశం కల్పిస్తోంది.

Read Also: జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్

కాగా ఫేస్‌బుక్ ఇప్పటివరకు 3 బిలియన్‌ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వాడే వారిలో చాలామంది ఫేస్‌బుక్ వాడుతుంటారు. మరోవైపు ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో అశ్లీలత కీవర్డ్‌లను నిరోధించడానికి తగు చర్యలు చేపట్టింది. ఎవరైనా అశ్లీలత కీవర్డ్‌లను ఉపయోగిస్తే వాటిని సస్పెండ్ లేదా బ్యానింగ్ చేసేలా అనేక కామెంట్ మోడరేషన్ సాధనాలను ప్రవేశపెట్టే యోచనలో ఫేస్‌బుక్ ఉన్నట్లు తెలుస్తోంది.