గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచాన్ని కరోనా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొన్ని దేశాలు కరోనా నుంచి బయటపడి తిరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా, కొన్ని దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అనేక దేశాల్లో కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు. పర్యాటకంపై ఆధారపడే దేశాల్లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇలా సంక్షోభంలో కూరుకుపోయిన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. శ్రీలంక పర్యాటకంపై ఆధారపడిన దేశం కావడంతో ఆ దేశం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నది. శ్రీలంకలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొన్నది. దేశంలో ఫుడ్ ఎమర్జెన్నీ విధించారు. దీంతో ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రేషన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో పంచదార రూ.200 పలుకుంది అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2020లో ఆ దేశ ఆర్థిక పరిస్థితి 3.6 శాతం పడిపోయింది. విదేశీ మారకద్రవ్యం భారీగా తరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి.
Read: గుడ్‌న్యూస్: ఆ గ్రహంపై నీటి జాడను కనిపెట్టిన శాస్త్రవేత్తలు… భూమిపై కంటే…
