గుడ్‌న్యూస్‌: ఆ గ్ర‌హంపై నీటి జాడ‌ను క‌నిపెట్టిన శాస్త్ర‌వేత్త‌లు… భూమిపై కంటే…

భూమిపై కాకుండా ఇత‌ర గ్ర‌హాల్లో ఆవాస‌యోగ్యవంత‌మైన గ్రహాల కోసం నాసా చాలా కాలంగా అన్వేష‌ణ సాగిస్తున్న‌ది.  ఈ అన్వేష‌ణ‌లో భాగంగా జూపిట‌ర్ గ్ర‌హానికి ఉన్న ఉపగ్రహాల‌పై ప‌రిశోధ‌న చేస్తున్న‌ది. జూపిట‌ర్ గ్ర‌హానికి ఉన్న ఉప‌గ్ర‌హాల్లో గ‌నీమేడ్ అనే ఉప‌గ్ర‌హం ఉన్న‌ది.  ఈ ఉప‌గ్ర‌హం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.   గ‌నీమేడ్ ఉప‌గ్ర‌హంలో నీటి జాడ‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.  ఆ నీరు తాగ‌డానికి ప‌నికి వ‌స్తుందా లేదా అనే విష‌యాల‌పై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పాల్సి ఉన్న‌ది.  గ‌నీమేడ్‌పై భాగం మొత్తం మంచుతో క‌ప్ప‌బ‌డి ఉన్న‌ది.  ఆ మంచు ఉప‌రితం నుంచి 160 కిలోమీట‌ర్ల మేర త‌వ్వితే నీరు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు.  ఉప‌రిత‌లంపై ఉష్ణోగ్ర‌త -138 నుంచి -183 డిగ్రీల వ‌ర‌కు ఉంటుంది.   అంత‌టి చ‌లిలో ఆ మంచుకు క‌రిగించ‌డం అంటే సాధ్యం కాక‌పోవ‌చ్చు.  గ‌నీమేడ్ మ‌ధ్య‌రేఖా ప్రాంతంలో అప్పుడ‌ప్పుడు కొద్దిగా మంచు కురుగుతుంద‌ని, అలా మంచు క‌రిగిన స‌మ‌యంలో ఆక్సీజ‌న్ రేణువులు వెలువ‌డ‌తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  భూమిపై ఉన్న విధంగానే గ‌నీమేడ్‌పై కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉండ‌టంతో మ‌నిషి దానిపై స్థిరంగా నిల‌బ‌డ‌గ‌లుగుతాడ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నావేస్తున్నారు.  ఈ ఉప‌గ్ర‌హం భూమికంటే 11 రెట్లు పెద్ద‌దిగా ఉండటంతో భ‌విష్య‌త్తులో ఆవాస‌యోగ్యంగా మారితే నాగ‌రిక‌త‌ను అభివృద్ధి చేయ‌డానికి ఎంత‌గానో ఈ ఉప‌గ్ర‌హం ఉప‌యోగ‌ప‌డుతుంది.  

Read: భూలోక న‌ర‌కం: అంద‌మైన దీవిలో శవాల దిబ్బ‌లు…

Related Articles

Latest Articles

-Advertisement-