పాకిస్తాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. భారీ పేలుడు ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read: శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే…
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పెలుడు జరిగిన బిల్డింగ్ కు సమీపంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే, పేలుడు భారీస్థాయిలో ఉండటంతో ఇది ఉగ్రవాదుల పనే అనే అనుమానాలు కలుగుతున్నాయని పాక్ మీడియా తెలియజేసింది.
