హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
Read Also: దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు
అయితే పీవోపీ విగ్రహాల తయారీ పరిశ్రమలో బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు .రసాయనాలు కలవడంతోనే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని వారు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పంపామన్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.