NTV Telugu Site icon

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం బంగారం ధర ఎంతంటే?

Gold Price

Gold Price

పసిడి ప్రియులకు శుభవార్త. పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి బులియన్ మార్కెట్‌కు ఉపశమనం లభించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.390, 24 క్యారెట్ల పసిడి ధర రూ.430 తగ్గంది. ఇక వెండి ధర రూ.300 తగ్గింది. మంగళవారం (ఏప్రిల్ 11) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,430గా ఉంది. కిలో వెండి ధర రూ. 76,300కి చేరింది.
Also Read:Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు.. 32 మండలాల్లో అప్రమత్తం

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,430గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.60,430గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430గా ఉంది.
Also Read:Bandi Sanjay : జీతాలే ఇయ్యలేనోడు.. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొంటాడా?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100, కోల్‌కతా 22 క్యారెట్ ధర 10. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480గా ఉంది. కాగా, ఈ ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు ధరలను తనిఖీ చేయడం మంచిది.