Site icon NTV Telugu

మాజీ ప్రధాని మహన్మోన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు.. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఎయిమ్స్‌లో మన్మోహన్‌కు చికిత్స కొనసాగుతోంది.. ఆయన సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారని. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది ఏఐసీసీ.. మన్మోహన్‌ సింగ్‌.. ఎయిమ్స్‌లో సాధారణ చికిత్స తీసుకుంటున్నారని… ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అవసరమైనప్పుడు మేం ఏదైనా హెల్త్ అప్‌డేట్‌కు సంబంధించిన విషయాలకు వెల్లడిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్‌ ఝా ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

కాగా, ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో మన్మోహన్‌ సింగ్ చేరినట్లు జాతీయ మీడియా పేర్కొంది.. ఈ మాజీ ప్రధానికి గుండె సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నారు.. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది.. 1990 నుండి ఆయనకు ఐదు బైపాస్‌ సర్జరీలు జరగగా.. 2004లో స్టెంటింగ్ చికిత్స చేయించుకున్నారు.. మరోవైపు.. గత ఏడాది మేలో, ఛాతీలో నొప్పితో ఎయిమ్స్‌ లో చేరిన మన్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆసుపత్రిలో చేరారు. అయితే, విజయవంతంగా కోలుకున్న తర్వాత ఏప్రిల్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Exit mobile version