NTV Telugu Site icon

ఈటల, టీఆర్‌ఎస్‌ ఎంపీ భేటీ.. అంతర్యమేంటి..?

గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్‌ పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కలిశారు. ఉప ఎన్నికల తరువాత తన ఎన్నిక కోసం కృషి చేసినవారిని కలుస్తున్న ఈటల.. అనుహ్యంగా ఎంపీ శ్రీనివాస్‌తో భేటీ అవడంతో.. రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. అంతర్యమేంటోనని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న డీ శ్రీనివాస్‌ బీజేపీ చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారా..? అనే ప్రశ్ని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొన్న ప్రశ్న.