NTV Telugu Site icon

తిరిగొచ్చిన పెళ్ళికొడుకు..ఘనంగా జరిగిన పెళ్లి

పెళ్ళి తంతు జరుగుతోంది. పెళ్ళిలో వుండాల్సిన పెళ్ళికొడుకు పారిపోయాడు. ఏమయిందో ఏమో తెలీదు. పారిపోయిన పెళ్ళికొడుకు తిరిగి వచ్చాడు. ఆగిపోయిందనుకున్న పెళ్ళి సజావుగా సాగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మనాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డికి, కొండాపూర్ మండలం సింధురెడ్డి అనే యువతికి పెళ్ళి నిశ్శయం అయింది. డిసెంబర్ 12న పెళ్ళి జరగాల్సి వుంది. పెళ్ళికి గంట ముందు కుటుంబ సభ్యులతో పాటు పెళ్ళికొడుకు మాణిక్యరెడ్డి పరారయ్యాడు.

పెళ్ళికొడుకుని పెళ్ళి మంటపానికి తీసుకెళ్ళేందుకు వచ్చిన పెళ్ళి కూతురు బంధువులు ఇంటికి తాళం వుండడంతో అవాక్కయ్యారు. వెంటనే అసలు విషయం పోలీసులకు ఫిర్యాదుచేశారు. 50 తులాల బంగారం, 25 లక్షల కట్నం కింద ఇచ్చామని పెళ్ళికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రెండుమూడు రోజుల తర్వాత పెళ్ళికొడుకు తిరిగొచ్చాడు. ఆగిపోయిందనుకున్న పెళ్ళి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. మాణిక్యరెడ్డికి తానంటే ఎంతో ఇష్టమని మళ్ళీ తిరిగి రావడంతో పెళ్ళి చేసుకున్నానని పెళ్ళికూతురు తెలిపింది. ఈ పెళ్ళి జిల్లాలో హాట్ టాపిక్ అయింది.