రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేదిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనం ఇచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం మండిపడ్డాయి. సంపూర్ణ మద్యపాన నిషేదం కేవలం ఓ కంటితుడుపు చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోందని, మద్యం మాఫియా డాన్‌లను వదిలేసి ప్రభుత్వం పేదలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జేడీ మండిపడింది.
Read: కలవరపెడుతున్న ఒమిక్రాన్… జపాన్‌లో తొలికేసు నమోదు…
ఇక అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తామని స్పష్టం చేసిన మరుసటి రోజు ఇలా అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం దారుణమైన విషయం అని, తప్పని సరిగా దీనిని ఖండించాల్సిన అంశమని, స్పీకర్ అనుమతిస్తే దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
