150 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతిభకు ఏ మాత్రం కొదవ లేదు. అందుకే టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. తాజాగా ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్‌లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతున్న ట్విట్టర్ సంస్థకు కూడా ఇండియాకు చెందిన వ్యక్తే సీఈవో అయ్యారని… టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు తమకు సాటెవ్వరూ రారని నిరూపించుకుంటున్నారని లాస్ ఏంజిల్స్‌కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొలిసన్ ఓ ట్వీట్ చేశారు.
Read Also: సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
దీంతో ఈ ట్వీట్‌కు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారతదేశంలోని ప్రతిభావంతుల నుంచి అమెరికా గొప్పగా ప్రయోజనం పొందుతుందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఎలన్ మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది. భూమిపై ఉన్న దేశాల్లో చాలామంది విద్యావంతులు ఉన్న ఏకైక దేశం భారత్ అని.. అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా భారతీయులు తమ సత్తా చాటుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే.
