ప్రపంచ కుబేరుడు, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను త్వరలోనే తన అన్ని ఉద్యోగాల నుంచి తప్పుకుంటానని, ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కొనసాగుతానని, దీనిపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎలన్ మస్క్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మస్క్ టెస్లాలోని తన వాటా షేర్లను అమ్మెయ్యాలని అనుకుంటున్నట్లు ట్వీట్ చేసి హైలైట్ అయ్యారు.
Read: ఎమ్మెల్సీ ఎన్నికలు.. పెద్దపల్లి పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
అయితే, మస్క్ అనుకున్నట్టుగానే టెస్లాలోని తన 10శాతం వాటా షేర్లను అమ్మేశారు. కాగా, ఇప్పుడు తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ట్వీట్ చేయడంతో ప్రపంచం దృష్టి మొత్తం మస్క్‌వైపు మరలింది. టెస్లా నుంచి మాత్రమే తప్పుకుంటారా లేదంటే అటు స్పేస్ ఎక్స్ నుంచి కూడా తప్పుకుంటారా అన్నది చూడాలి. మస్క్ ఏం చేసినా ఓ సంచలనమే కావడంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
