Site icon NTV Telugu

పైసా లేకుండా అమెరికా వ‌చ్చి…ప్ర‌పంచ కుబేరుడ‌య్యాడు…

ఎల‌న్ మ‌స్క్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.  టెస్లా కార్ల కంపెనీని స్థాపించి ల‌క్ష‌లాది మందికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించారు.   అంతేకాకుండా, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష ప్ర‌యోగాలు చేప‌డుతున్నారు. ప్ర‌పంచ కుబేరుల‌ను వెన‌క్కి నెట్టి ఎల‌న్ మ‌స్క్ ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.  300 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో మ‌స్క్ మొద‌టి స్థానంలో ఉన్నాడు.  ఎల‌న్ మ‌స్క్ ను కీర్తిస్తూ ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు.  మ‌స్క్ 17 ఏళ్ల వ‌య‌సులో అమెరికాకు వ‌చ్చాడ‌ని, సంప‌ద‌ను సృష్టించి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించార‌ని, కంపెనీలు స్థాపించి ట్యాక్స్ రూపంలో అమెరికాకు ఆదాయం స‌మ‌కూర్చార‌ని ట్వీట్ చేశాడు.  

Read: చంద్రబాబు పద్మవ్యూహం పన్నుతున్నారా.. అందుకేనా ఇది..!

దీనిపై స్పందించిన మ‌స్క్ 17 ఏళ్ల వ‌య‌సులో చిల్లి గ‌వ్వ లేకుండా అమెరికాకు వ‌చ్చిన విష‌యం వాస్త‌వమే అని, డ‌బ్బు కోసం రెండు ఉద్యోగాలు చేస్తూ చ‌దువుకున్నాన‌ని, స్కాల‌ర్‌షిప్ వ‌చ్చినా చ‌దువు పూర్త‌య్యే స‌మ‌యానికి ల‌క్ష డాల‌ర్ల అప్పు అయ్యింద‌ని మ‌స్క్ పేర్కొన్నారు.  సోలార్‌, రోబొటిక్‌, క్రిప్టో క‌రెన్సీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, స్పేస్ సైన్స్ ఇలా అన్ని రంగాల్లో ఎల‌న్ మ‌స్క్ కంపెనీలు రాణిస్తున్నాయి.  తొలినాళ్ల‌లో ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఇదేన‌ని అయ‌న అన్నారు.  

Exit mobile version