Site icon NTV Telugu

అప్ప‌టికి… ఇప్ప‌టికి ఎంత తేడా?

ఎడారి దేశం ఈజిప్ట్ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది పిర‌మిడ్స్‌.  వేల సంవ‌త్స‌రాల క్రితం పిర‌మిడ్స్ ను నిర్మించారు.  ఎంద‌రో పిర‌మిడ్స్‌పై పరిశోధ‌న‌లు చేశారు.  అందులోని సంప‌ద‌ను కొల్ల‌గొట్టారు.  మ‌మ్మీల‌ను దొంగిలించారు.  పిర‌మిడ్‌లు నిర్మించిన స‌మ‌యానికే ఆ దేశంలో గొప్ప సంస్కృతి వెల్లివిరిసింది.  కాల క్ర‌మేణా ఆ సంస్కృతి, అప్ప‌టి భ‌వ‌నాలు పుడ‌మిగ‌ర్భంలో క‌లిసిపోయాయి.  ఇప్పుడు కొన్ని శిధిలాలు మాత్ర‌మే అప్ప‌టి సంస్కృతికి స‌జీవ సాక్ష్యాలుగా నిలిచాయి.  

Read: విద్యాసంస్థ‌ల్లో క‌రోనా టెన్ష‌న్‌… 72 గంట‌ల్లో…

కాగా, ఆధునిక యుగం 21 వ శ‌తాబ్దంలో పిర‌మిడ్ చుట్టూ పెద్ద పెద్ద న‌గ‌రాలు వెలిశాయి.  ప‌ర్యాట‌కంగా ఈజిప్ట్ దేశం ఆక‌ట్టుకుంటోంది.  1875 వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి చిత్ర‌కారులు ఈజిప్ట్‌కు సంబంధించిన ఫొటోను తీశారు.  ఆ ఫొటోను, 2020 వ సంవ‌త్స‌రంలో తీసిన ఫోటోను పక్క ప‌క్క‌నే ఉంచి ఔరా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  ఒక‌ప్పుడు ఏమీ లేని ఆ ప్రాంతంలో ఓ పెద్ద న‌గ‌ర‌మే వెలిసింది.  

Exit mobile version