NTV Telugu Site icon

కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహార‌మా అనే దానిపై చాలా మంది మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంటారు.  ఎగ్ శాఖాహార‌మై అని కొంద‌రూ, కాదు కాదు మాంసాహ‌ర‌మ‌ని మ‌రికొంద‌రు చెబుతుంటారు.  అయితే, కోడి నుంచి వ‌స్తుంది కాబ‌ట్టి ఎగ్ అనేది మాంసాహార‌మే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప‌రిశోధ‌న‌ల‌తో చెక్ పెట్టారు.  ప్ర‌స్తుతం మార్కెట్లో ల‌భిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజ‌ర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండ‌ద‌ని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్ర‌మే ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  

Read: పోరాటంలో మ‌ర‌ణించిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వ‌లేం… తేల్చి చెప్పిన కేంద్రం…

ఇక, ఎగ్ వైట్ లోప‌ల ఉండే ప‌చ్చ‌ని సొనలో అధిక‌సంఖ్య‌లో ప్రోటీన్లు, కొలెస్ట్ర‌రాల్ మాత్ర‌మే ఉంటుంది.  ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  కోళ్లు జ‌న్మించిన ఆరు నెల‌ల కాలం నుంచి రెండు రోజుల‌కు ఒక గుడ్డు పెడుతుంటాయి.   కోడి పుంజుతో క‌ల‌వ‌కపోయినా గుడ్లు పెట్టె విధానాన్ని అన్ ఫెర్టిలైజ‌ర్ అంటార‌ని, ప్ర‌స్తుతం మార్కెట్లో దొరికే ఎగ్స్ అన్‌ఫెర్టిలైజ‌ర్ ఎగ్స్ కావ‌డంతో వాటిని శాఖాహారంగా తీసుకోవ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు.