Site icon NTV Telugu

గుడ్‌న్యూస్.. నేడే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు

ఏపీలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజుల్ని జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ప్రభుత్వం వెంటనే ఫీజు డబ్బులను చెల్లిస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను మంగళవారం నాడు సీఎం జగన్ తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పథకాన్ని ఏపీ సర్కారు అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జగన్ సర్కారు జమచేస్తోంది. మొదటి విడతగా ఈ ఏడాది ఏప్రిల్ 19, రెండో విడతగా జూలై 29న, మూడో విడతగా నవంబర్ 30న, నాలుగో విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఫీజు డబ్బులను చెల్లిస్తోంది.

Exit mobile version