Site icon NTV Telugu

విశాఖలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Read Also: నాలుగు రాష్ట్రాలలో మళ్లీ బీజేపీదే అధికారం… స్పష్టం చేసిన సర్వే

Exit mobile version