NTV Telugu Site icon

శ‌తాబ్దం చివ‌రినాటికి… భూవినాశ‌నం త‌ప్ప‌దా…

ప్ర‌పంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న‌ది.  కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఇటీవ‌లే గ్లాస్కోలో కాప్ 26 స‌ద‌స్సు నిర్వ‌హించారు.  ఈ స‌ద‌స్సులో భాగంగా భూతాపం, ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎలా వాతావ‌ర‌ణంలో వేడిని త‌గ్గించ‌వ‌చ్చు అనే విష‌యాల‌పై చ‌ర్చించారు.  ఇక ఇదిలా ఉంటే, ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, దీని వ‌ల‌న భూవినాశనం త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు.  ఇంట‌ర్ గ‌వ‌ర్న‌మెంట‌ల్ ప్యాన‌ల్ ఆన్ క్లైమేట్ అనే అంశంపై శాస్త్ర‌వేత్త‌లు ఓ నివేదిక‌ను త‌యారు చేశారు.  

Read: స్పేస్ యుద్ధం: బెజోస్‌పై ఎల‌న్ పైచేయి…

ఈ నివేదిక ప్ర‌కారం 2100 నుంచి ప్ర‌పంచంలో ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులు సంభ‌విస్తుంటాయ‌ని పేర్కొన్నారు.  ఈ నివేద‌క‌లోని అంశాల‌ను జ‌ర్న‌ల్ ఆప్‌ది నేచ‌ర్ ప‌త్ర‌క‌లో ప్ర‌చురించారు.  భూమిపై స‌హ‌జ‌వ‌న‌రులు దుర్వినియోగం అవుతున్నాయ‌ని, దీని వ‌ల‌న నేచ‌ర్ లో వేగంగా మార్పులు వ‌స్తున్నాయ‌ని, వాతార‌ణంలో మార్పుల కార‌ణంగా వ‌ర్ష‌పాతంలో మార్పులు సంభ‌విస్తాయ‌ని, ఈ మార్పులు భూమికి మంచిది కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  అంత‌ర్జాతీయ వేదిక‌లు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసినా ప్ర‌భుత్వాలు వేగంగా స్పందించ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.  ప్ర‌పంచ దేశాలు ఇలానే నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఈ శ‌తాబ్దం చివ‌రి వ‌ర‌కు భూవినాశం త‌ప్ప‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు.