దసరా వచ్చింది అంటే పల్లెలకు, సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. నగరాలు, పట్టణాలను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. కరోనా కారణంగా గత సంవత్సం దసరా వేడుకలు మూగబోయాయి. అయితే, ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రవాణా వ్యవస్థలు కూడా దారుణంగా నష్టపోయాయి. దీంతో ఇప్పుడు ఆయా సంస్థలు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. కాగా, ఇప్పుడు, ఇండియన్ రైల్వేలు కూడా భారీ మొత్తంలో ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. టికెట్ల ధరలను భారీగా పెంచాయి. బోగి రకం, దూరాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ.200 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. స్లీపర్, సెకండ్, థర్డ్ ఏసీల టికెట్ల ధరలు భారీగా పెరిగాయి.
Read: బాలయ్య కాలికి గాయం
