బాలయ్య కాలికి గాయం

నందమూరి నటసింహం బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అది చిన్న గాయమేనని, కంగారు పడాల్సిందేమీ లేదని సమాచారం. షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీ బాలయ్య దానిని పెద్దగా పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టారు. అసలు ఆ గాయం ఏంటి ? షూటింగ్ ఎక్కడ జరిగింది ? అంటే… బాలయ్య ఓ టాక్ షోలో కన్పించబోతున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షోను నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్న దానికి సంబంధించిన ఫోటోషూట్ జరిగిందట. ఆహా టాక్ షో ఫోటో షూట్ సమయంలో బాలయ్య కాలుకి చిన్న గాయం అయింది. కానీ బాలయ్య సమయం వృధా చేయకుండా గాయాన్ని లెక్క చేయకుండా ఫోటో షూట్ కానిచ్చేశారు. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నందమూరి అభిమానులను ఫిదా చేసేస్తోంది. సినిమాల కోసం ఆయన పడే తపన, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

Read Also : ‘ఆదిపురుష్‌’ లో లంకేశ్‌ పని అయిపోయింది!

కాగా బాలయ్య “అఖండ” సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” సినిమాలో అఘోరీగా కనిపించే సాహసం చేశారు. ఆ లుక్ కు సంబంధించి విడుదలైన టీజర్ తో రికార్డులు దద్దరిల్లాయి. ప్రస్తుతానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

-Advertisement-బాలయ్య కాలికి గాయం

Related Articles

Latest Articles