Site icon NTV Telugu

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే… తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి మొదటి సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర, అమిత్‌ త్రివేది, అనిరుధ్‌, యాజిన్‌ నైజర్‌, విజయ్‌ ఏసుదాసు, ఇలా ఐదు బాషాలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌ చరణ్‌ మరియు తారక్‌ ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు.. ఈ సాంగ్‌ వింటే అందరకీ అర్థమవుతోంది.

https://www.youtube.com/watch?v=VPT_EIo89cc
Exit mobile version