Site icon NTV Telugu

ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఓ నవజాత శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యునిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండా కు చెందిన నిండు గర్భిణీని ప్రసూతి నిమిత్తం తొలుత జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స అందించిన తర్వాత గర్భిణీకి తీవ్ర అస్వస్థత కలిగింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఖమ్మం పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణికి జన్మించిన నవజాత శిశువు మృతి చెంది. దీంతో బంధువులు మహబూబాబాద్ లోని ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించి ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది.విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

Exit mobile version