1859లో ఇండియాలో తొలిసారి రైళ్లను ప్రవేశపెట్టారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో భారతీయ రైల్వేలను జాతీయం చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఇండియా. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి రైళ్లను వినియోగిస్తుంటారు. అయితే, రైలు పెట్టెల పైభాగంలో ఒక మూల వైపు పసుపు, తెలుపు, గ్రీన్ వంటి గీతలు ఉంటాయి. అవి ఎందుకు వేస్తారో, వాటి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా అంటే లేదని చెబుతాం. ఆ గీతల వెనుక చాలా అర్ధం ఉన్నది. ఎక్స్‌ప్రెస్, హైస్పీడ్‌తో ప్రయాణం చేసే రైళ్ల కిటికీలపై తెలుపు రంగు లైన్లు వేస్తారు. దీని అర్ధం ఏమంటే ఈ కోచ్‌లు రిజర్వ కాలేదు అని. ప్రయాణికులు ఎవరైనా సరే ఆ కోచ్‌లలో కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. పసుపు రంగు గీతలు వేసి ఉంటే ప్రత్యేకమైన కోచ్ అని, దివ్యాంగుల కోసం, అనారోగ్యంతో బాధపడేవారి కోసం కేటాయించిన కోచ్‌లుగా చెబుతారు. అలానే గ్రీన్, బ్లాక్ లైన్స్ ఉంటే మహిళల కోసం కేటాయించిన కోచ్‌లుగా గమనించాలి. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఏ కోచ్ ఏంటో తెలుసుకోవడానికి వీలుగా ఇలా రంగులు వేస్తుంటారు.
రైల్వే కోచ్‌లలో పసుపు… తెలుపు గీతలకు అర్ధం ఏంటో తెలుసా…
