Site icon NTV Telugu

అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు

వాషింగ్టన్‌ డీసీలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దీపావళి వేడుకల్లో అమెరికా ప్రజాప్రతినిధులు పాల్గొనడం విశేషం. అంతేకాకుండా చీకటిని తొలగించే సత్యం, జ్ఞానాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

నేషనల్‌ డెమొక్రటిక్‌ క్లబ్‌లో ప్రముఖులు దీపాలు వెలగించారు. ఎన్‌ఆర్‌ఐలు, అమెరికన్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తొలిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై దీపావళి థీమ్‌ను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదీతీరంలో ఎన్‌ఆర్‌ఐలు నదీతీరంలో బాణసంచాలు కాల్చారు.

Exit mobile version