NTV Telugu Site icon

ఐక్యరాజ్య‌స‌మితిలో డైనోసార్‌… ప‌ర్యావ‌ర‌ణంపై చుర‌క‌లు…

ప్ర‌పంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఒక‌టి వాతావ‌ర‌ణ కాలుష్యం.  వాతార‌వ‌ణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నాయి.  ఇదే స‌మ‌యంలో కాలుష్యాన్ని పెంచే శిలాజఇంధ‌నాల‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీనికి ప్ర‌భుత్వాలు కోట్ల డాల‌ర్ల స‌బ్సిడీలు ఇస్తున్నాయి.  ఈ స‌బ్సిడీకోసం వినియోగిస్తున్న నిధుల‌ను ప్ర‌పంచంలోని పేద‌ల‌కు పంచితే వారు పేద‌రికం నుంచి కొంత‌మేర బ‌య‌ట‌ప‌డ‌తారు.  ఈ విష‌యాల‌ను చెప్పింది ఎవ‌రో కాదు.. కోట్ల సంవత్స‌రాల క్రితం అంత‌రించిపోయిన ఓ డైనోసార్‌.

Read:పాక్ రోడ్ల‌పై ఆస్ట్రిచ్ ప‌రుగులు…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…

ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీలోకి ప్ర‌వేశించిన డైనోసార్ ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి మాట్లాడింది.  ప్ర‌పంచ దేశాలు వినాశ‌నం వైపు ప‌య‌నిస్తున్నాయని, త‌న మాట వినాల‌ని కోరింది.  వినాశ‌నాన్ని ఎంచుకోకండి… మాన‌వ జాతిని ర‌క్షించుకోండి అంటూ పెద్ద లెక్చ‌ర్ ఇచ్చింది.  డైనోసార్ ఏంటి ఐరాస‌లో మాట్లాడ‌టం ఏంటి అని షాక్ అవ్వ‌కండి.  త్వ‌ర‌లో ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌పంచ దేశాల స‌దస్సు జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సంద‌ర్భంగా ఐరాస చిన్న వీడియోను రూపొందించింది.  మ‌నుషులు ఎలా ప‌య‌నిస్తున్నారో, ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో  తెలియ‌జేసేందుకు ఈ వీడియోను రూపొందించారు.  ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న‌ది.