వరుసగా పెరుగుతూ సామాన్యుడికి భారంగా మారిపోయాయి పెట్రో ధరలు.. అయితే, గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతూ వస్తుండగా.. పెట్రోల్ ధరలు అలాగే ఉన్నా.. డీజిల్ ధరలు మాత్రం కాస్త మళ్లీ కిందికి దిగివస్తున్నాయి.. వరుసగా మూడో రోజు కూడా డీజిల్ ధర తగ్గింది.. ఇవాళ లీటర్ డీజిల్‌పై 25 పైసల మేర కోత పెట్టాయి ఆయిల్ సంస్థలు.. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27కి దిగివచ్చింది. పెట్రోల్ ధర రూ.101.84గా కొనసాగుతోంది.. ఇక, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.47గా ఉంటే.. డీజిల్ ధర రూ. 93.84కి తగ్గింది. ఇక, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.08గా ఉంటే.. లీటర్ డీజిల్ ధర రూ.92.52గా ఉంది. మరోవైపు.. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.33కి తగ్గగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.105.83గా కొనసాగుతోంది.
మరోసారి తగ్గిన డీజిల్ ధర

diesel price