NTV Telugu Site icon

డీజీసీఏ కీల‌క నిర్ణ‌యం: అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు…

క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే అంచ‌నాతో డిసెంబ‌ర్ 17 నుంచి అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌ను పూర్తి స్థాయిలో పున‌రుద్ద‌రించాల‌ని సివిల్ ఏవియేష‌న్ మొద‌ట ప్ర‌క‌టించింది.  అయితే,  ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం, యూర‌ప్ దేశాల్లో వేగంగా క‌రోనా వ్యాపిస్తుండ‌టం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంత‌ర్జాతీయ విమానాల స‌ర్వీసుల‌పై డీజీసీఐ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.  క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌టి వేవ్ స‌మ‌యంలో వివిధ దేశాల్లో చిక్కున్న భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు వందేభార‌త్ పేరుతో కొన్ని విమానాల‌ను న‌డిపారు.  

Read: 2021లో పాపుల‌రైన హ్యాష్‌ట్యాగ్స్ ఇవే…

ఆ త‌రువాత ఎయిర్ బ‌బుల్ ఒప్పందం కింద 32 దేశాల‌కు విమాన స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నారు.  ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే ఈ స‌ర్వీసులు న‌డుస్తున్నాయి.  డిసెంబ‌ర్ 17 నుంచి పూర్తిస్థాయిలో అంత‌ర్జాతీయ విమానాలు న‌డ‌పాల‌ని అనుకున్నా ఒమిక్రాన్ కేసుల కార‌ణంగా ఆ నిర్ణ‌యాన్ని డీజీసీఐ వెనక్కి తీసుకుంది.  జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఎయిర్ బ‌బుల్ ఒప్పందం ప్ర‌కార‌మే విమాన స‌ర్వీసులు స‌డుస్తాయ‌ని ప్ర‌క‌టించింది.