NTV Telugu Site icon

రియ‌ల్ గ‌జ‌నీ… ప్ర‌తి ఆరు గంట‌ల‌కోసారి…

గ‌జ‌నీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాల‌కు ఒక‌సారి గ‌తం మ‌ర్చిపోతుంటాడు.  త‌న‌ను తాను గుర్తు చేసుకోవ‌డానికి ఫోటోలు, ఫోన్ నంబ‌ర్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని తిరుగుతుంటాడు.  ఇది సినిమా.  ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం.  నిజంగా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. అత‌ను ప్ర‌తి 6 గంట‌ల‌కు ఒక‌సారి త‌న గ‌తాన్ని మ‌ర్చిపోతున్నాడు.  రోజులో ఇలా నాలుగుసార్లు జ‌రుగుతుంది.  మ‌ర్చిపోయిన విష‌యం గుర్తు తెచ్చుకోవ‌డానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు.  ఆ రియ‌ల్ గ‌జ‌నీపేరు డేనియ‌ల్ షుమిట్‌.  

Read: ట్రంప్‌కు భారీ న‌ష్టం… హోట‌ల్ అమ్మేందుకు సిద్దం…

2015 ఫిబ్ర‌వ‌రి 14 వ తేదీన త‌న సోద‌రిని క‌లిసేందుకు కారులో వెళ్తుండ‌గా కారు ప్ర‌మాదానికి గురైంది.  ఈ కారు ప్ర‌మాదంలో డేనియ‌ల్ త‌ల‌కు గాయ‌మైంది.  బ్రెయిన్ కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో మెమ‌రీ లాస్ గుర‌య్యాడు.  ప్ర‌తి ఆరుగంట‌ల‌కు ఒక‌సారి జ‌రిగిన విష‌యాలు మ‌ర్చిపోతున్నాడు.  అందుకే ఎక్క‌డ ఉన్నాడు, ఎవ‌రితో ఉన్నాడు, వారి వివ‌రాలు, అత్య‌వ‌స‌ర‌మైన ఫోన్ నెంబ‌ర్లు అన్నీ డైరీలో రాసిపెట్టుకొని మెయింటెయిన్ చేస్తున్నాడు.  త‌ల‌కు గాయం త‌రువాత పాజిటివ్‌గా ఆలోచించ‌డం మొద‌లుపెట్టాన‌ని, అంద‌రిలా కాకుండా త‌న లైఫ్ వేరుగా ఉండ‌టంతో దానికి త‌గిన విధంగా లైఫ్‌ను డిజైన్ చేసుకున్న‌ట్టుగా డేనియ‌ల్ షుమిట్ పేర్కొన్నాడు.